వైభవంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ జన్మదిన వేడుకలు...
సూర్య వీణవంక: మండల కేంద్రంలో ఎమ్మెల్సీ, యువజన నాయకుడు డాక్టర్ బల్మూరి వెంకట్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. డాక్టర్ బల్మూరి వెంకట్ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని, విద్యార్థులు, యువజన సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ, పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఈ జన్మదినం ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, మరెన్నో విజయాలను అందించాలని నాయకులు ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చింతల శ్యామ్ సుందర్ రెడ్డి, గుంటి రవీందర్, అడిగగోప్పుల వెంకన్న,గుంపుల గట్టయ్య, అల్గువెళ్లి మోహన్ రెడ్డి, శీలం సురేందర్ రెడ్డి,మందారపు నరేష్, వడ్డేపల్లి రాజగోపాల్, మడ్డి కిషోర్,ఎలుబాక సదయ్య, అజయ్,గుండెటి మహేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ నాయకులు,మందల అనిల్ రెడ్డి,పాల్గొన్నారు.