BREAKING
రైతులకు నోటీసులు.. రికార్డులు జిల్లా కేంద్రంలో! పిడుగుపాటుతో ఇల్లు ధ్వంసం-పరిశీలించిన సర్పంచ్ కుమారస్వామి కల్యాణలక్ష్మి.. సక్సెషన్ భూముల దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన.తహసీల్దార్‌ అశోక్‌ పాశమైలారం హరితహారం పార్కు భూమికి రక్షణ కరువు! పది ఎకరాల పార్కు భూమి ఆక్రమణకు గురైందా? ఆసియా తయారీ రంగానికి ఎదురుదెబ్బ చైనా తీరప్రాంత ఒత్తిడిని ధీటుగా ఎదుర్కొంటాం వీబీ-గ్రామ్ జీ చట్టం కింద నూతన ఫిర్యాదుల పరిష్కారానికి 15 రోజుల గడువు షేర్ మొహమ్మద్ పేట సెగ్మెంట్ 2 లో వాసుదేవరెడ్డి దే విజయం అంటున్న గ్రామస్తులు వైద్య రంగంలో కృత్రిమ మేధ విప్లవం..ఏఐ వైపు అడుగులు వేస్తున్న హెల్త్‌కేర్ సెక్టార్ పిజ్జా హట్, కేఎఫ్‌సీ ఆపరేటర్లకు ఊరట..భారీగా తగ్గిన నష్టాలు, పుంజుకున్న విక్రయాలు జర్మనీ ఆర్థిక వ్యవస్థకు ఎదురుదెబ్బ బిపి సంస్థ స్టోన్‌పీక్‌కు కాస్ట్రోల్ వాటా విక్రయం పూర్తి చేసిన ఎనర్జీ దిగ్గజం సౌదీ అరేబియాలో దక్షిణ నగరాల్లో ఆల్-క్లియర్ ప్రకటించిన సివిల్ డిఫెన్స్ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ముగ్గురు మృతి

సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వంపై పోరాటమే

Select Suryaa Now
సమస్యలు  పరిష్కరించకపోతే ప్రభుత్వంపై పోరాటమే

సూర్య, హుజురాబాద్ :రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీని పెడ చెవిన పెట్టిన , దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వంపై రిటైర్డ్ ఉద్యోగులు పోరాటమేనని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పేరి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం హుజురాబాద్ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం ఇచ్చే పి ఆర్ సి ను ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించలేదని అన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటివరకు ఉద్యోగులకు అందడం లేదని అన్నారు. నూతన హెల్త్ కార్డు ఇవ్వడం బాగున్నప్పటికీ తమ అనారోగ్య సమస్యలను పరిష్కరించుకోవడం కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు రిటైర్ ఉద్యోగులు వెళితే ఆసుపత్రులు సహకరించడం లేదని అన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ పిఆర్సి ని ప్రకటించకపోతే రిటైర్డ్ ఉద్యోగులంతా ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయని ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తే ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని అన్నారు. ఇప్పటికైనా రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ఉస్మాన్ భాష, జిల్లా ప్రధాన కార్యదర్శి జాలి మహేందర్ రెడ్డి నాయకులు గంజి చేయవర్ధన్ నరెడ్ల రాజమణి, గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.