ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం ఓ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్
దుద్యాల్, మేజర్ న్యూస్: కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల్ మండలం హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ లో చేపడుతున్న పనులను సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్ ఐఏఎస్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా లతో కలిసి సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణాల్లో ఉన్న పలు భవనాలను పరిశీలించారు. ఇదివరకు ఒకసారి పరిశీలించిన నాటినుండి నేటి వరకు పనుల్లో ఏమైనా పురోగతి ఉందా అనే అంశాలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నారు. అయన వెంటనే సీఎంఓ పర్యటనలో జిల్లా అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా, కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.
రిపోర్టర్: రమేష్, దుద్యాల్, వికారాబాద్ జిల్లా.