BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

ఉపవాస దీక్షతో ప్రభుత్వానికి వేదనను తెలియజేసిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు.

Select Suryaa Now
ఉపవాస దీక్షతో ప్రభుత్వానికి వేదనను తెలియజేసిన  ఎన్ హెచ్ ఎం  ఉద్యోగులు.
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి. :నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కొనసాగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా నేడు ఉపవాస దీక్ష నిర్వహించారు. సంవత్సరాలుగా ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తూ, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఎన్ హెచ్ ఎం  ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రత, క్రమబద్ధీకరణ, న్యాయమైన వేతనాలు, ఇతర సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా తమ నిరసనను తెలియజేశారు.ఏళ్ల తరబడి సేవలందించినప్పటికీ ఉద్యోగ భద్రతపై స్పష్టత లేకపోవడం, భవిష్యత్తుపై ఆందోళనతో పనిచేయాల్సి రావడం ఉద్యోగుల్లో తీవ్ర ఆవేదనకు కారణమవుతోందని వారు తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం సేవలందిస్తున్న తమ జీవితాల్లో కూడా ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరారు.“ప్రజలకు ప్రాణం పోసే వైద్య సేవలు అందిస్తున్న మాకు కూడా ఉద్యోగ భద్రత కావాలి. మా కుటుంబాల భవిష్యత్తుపై భరోసా కావాలి. మా సేవలకు తగిన గుర్తింపు కావాలి.” అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.ఉపవాస దీక్ష ద్వారా ప్రభుత్వం తమ బాధను, తమ కుటుంబాల ఆందోళనను మరియు మా న్యాయమైన డిమాండ్ల తీవ్రతను అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించి, ఎన్ హెచ్ ఎం  ఉద్యోగుల సమస్యలపై చర్చించి, శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.“మా పోరాటం శాంతియుతమైనది… మా డిమాండ్లు న్యాయమైనవి… ప్రభుత్వం స్పందించే వరకు మా సమస్యలను ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేస్తూనే ఉంటాం.” అని ఎన్ హెచ్ ఎం  ఉద్యోగులు తెలిపారు.“సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తున్న ఎన్ హెచ్ ఎం  ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించి, అర్హతలు మరియు వర్తించే నిబంధనలను పరిగణనలోకి తీసుకుని క్రమబద్ధీకరణపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలి.”అధ్యక్షులు దొంతుల ప్రవీణ్ 
వైస్ ప్రెసిడెంట్ డా. ఇశ్వర్ డా. సుజాత జాయింట్ సెక్రటరీ రాజారెడ్డి ట్రేసరర్  : డి . గితేష్ ఆర్గనైసింగ్ సెక్రటరీ గోపాల్,ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ 
చంద్రశేఖర్, డా. శ్రీకాంత్ కే . సురేష్ విశ్వనాధ్ డా. పూనమ్, రమణ, దత్తు, సురేందర్, డా.అనిల్ యాదవ్, ప్రియాంక, ఆనంద్, జ్యోతి, నవీన్, దుర్గ డా. పి. శ్రీలత, పాల్గొన్నారు