తుర్కపల్లిలో ఘనంగా శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం.. యాదవుల ఐక్యతకు సదర్ వేడుకలు ప్రతీక
శామీర్‌పేట, మేజర్ న్యూస్: యాదవుల ఐక్యత, ఆత్మగౌరవం, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందించడంలో సదర్ సమ్మేళనాలు కీలక పాత్ర పోషిస్తాయని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు.బుధవారం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తుర్కపల్లి గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ సదర్ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తోటకూర వజ్రేష్ యాదవ్ శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం యాదవ సోదరులతో కలిసి సదర్ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యాదవుల ఐక్యతను చాటడంతో పాటు, వారి ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవడంలో ఇలాంటి వేడుకలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటాయని పేర్కొన్నారు. సదర్ సమ్మేళనాలు సమాజంలోని ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో అలియాబాద్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సిములు యాదవ్, ఏ బ్లాక్ అధ్యక్షులు జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి, అలియాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకి రమేష్, వైస్ చైర్‌పర్సన్ కాన్రెడ్డి మాలతి మాధవరెడ్డి, స్థానిక కౌన్సిలర్ గుర్కాల దీపా సాయి కృష్ణ యాదవ్, యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.