BREAKING
ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధికి బాటలు వేస్తా భారత్‌–అమెరికా సంబంధాలకు ప్రజాస్వామ్య సంస్థలే బలమైన పునాది: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఇటలీ అంతర్జాల దాడులకు బాధ్యులెవరో స్వతంత్రంగా నిర్ధారించాల్సి ఉంది.. సాంకేతిక దర్యాప్తులో కీలక అంశాలు! ఏపీలో 601 ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు పూర్తి.. ఒకే రోజు థియేటర్లలో మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు! పొన్నూరు 37వ వార్డులో జోరందుకున్న వైసీపీ ఎన్నికల ప్రచారం ప్రచారంలో పాల్గొన్న వైసీపీ చైర్మన్ అభ్యర్థి షేక్ నాజిని సిద్ధిపేట.. ఇక కాంగ్రెస్ అడ్డా.. బ్యాచులర్ పార్టీ డ్యూక్స్ రివ్యూ.. 14 ఏళ్ల తర్వాత అమల్ నీరద్ స్టైలిష్ యాక్షన్ ఎలా ఉందంటే? అన్నారంలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ రుద్ర సహిత కాలబైరవ మహా యజ్ఞంకు విస్తృత ఏర్పాట్లు ఓం సినిమాకు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్.. తెలుగు వెర్షన్‌కే అగ్రస్థానం! శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం శరీరానికి ఉపవాసం..మనసుకు నామస్మరణ.. ఆత్మకు ఆధ్యాత్మిక చింతన..అనుగ్రహించేదే.. మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం హెయిల్ మేరీ నుంచి మారివిల్ చిరకే వీడియో సాంగ్ విడుదల.. సూరజ్ వెంజారమూడు భావోద్వేగ నటన!

తుక్కాపూర్ గ్రామ రైతుల సాగునీటి సమస్యపై ఎమ్మెల్యే చొరవ

Select Suryaa Now
తుక్కాపూర్ గ్రామ రైతుల సాగునీటి సమస్యపై ఎమ్మెల్యే చొరవ

కొల్చారం ..కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామ రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్య పరిష్కారానికి మంజీరా నదిపై చెక్‌డ్యామ్ నిర్మించాలని చేసిన విజ్ఞప్తికి ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి తక్షణమే స్పందించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.బుధవారం తుక్కాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డికి గ్రామ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు సభా వేదికపై గ్రామ రైతాంగం తరఫున మంజీరా నదిపై చెక్‌డ్యామ్ నిర్మించాలని కోరారు. రైతుల విజ్ఞప్తిని సానుకూలంగా తీసుకున్న ఎమ్మెల్యే వెంటనే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాయడం పట్ల గ్రామ రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
రైతుల సాగునీటి అవసరాలను గుర్తించి తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డికి తుక్కాపూర్ గ్రామ రైతాంగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.