BREAKING
ఐదు సొసైటీల్లో పదవుల భర్తీపై ఆసక్తి.. సామాజిక సమీకరణాల చుట్టూ చర్చలు చికిత్స పొందుతూ వ్యక్తి మృతి డీసీఎం ఢీ కొట్టిన ఘటనలో మృత్యు ఒడిలోకి మూడో వ్యక్తి హెచ్‌ఐవీ నియంత్రణలో 95-95-95 లక్ష్యాల సాధనకు ప్రత్యేక కార్యాచరణ* *మొదటి రెండు లక్ష్యాలను 100 శాతానికి చేర్చేలా చర్యలు చేపట్టాలి* *మొబైల్ ఐసీటీసీ వాహనాల ద్వారా విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి* స్వర హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం గురువే సమాజ ప్రగతికి పునాది 'ఫీల్ గుడ్' చిత్రం నుండి యూత్‌ఫుల్ మెలోడీ 'మమ్మా మియా' పాట విడుదల జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ 125 రోజులు పని పొందాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా శివపూర్ గ్రామంలో ఘనంగా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం - చైర్మన్ నాగం గంగారం మూడు నామినేషన్లు తిరస్కరణ రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో పీఎం రాహత్ పథకం కీలక పాత్ర పోషిస్తుంది : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మృత సర్పంచ్ కుటుంబానికి అండగా ఉంటా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పరిషత్తు పోరు"నామినేషన్" సక్రమం...ఇక అసలైన సమరం! కీర్తి సురేష్, రాధికా ఆప్టేల ‘అక్క’ ట్రైలర్ విడుదల: అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల విద్యార్థులు మాదాకద్రవ్యాలకు దూరంగా ఉండాలి అగ్రిగోల్డ్ బాధితుల నుండి బాండ్లు సేకరణ.. * పోలీస్ బ్యారెక్స్ కళ్యాణ మండపం వద్ద బారులు తీరిన బాధితులు *

తెలంగాణకు కరువు సాయం ఎప్పుడు తెస్తారు?: బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు పాదయాత్రపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు

Select Suryaa Now
తెలంగాణకు కరువు సాయం ఎప్పుడు తెస్తారు?:   బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు పాదయాత్రపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు

తెలంగాణ బ్యూరో ప్రతినిధి  :   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు చేపట్టనున్న పాదయాత్రపై ప్రభుత్వ విప్, సీఎల్పీ మీడియా సెంటర్ ప్రతినిధి ఆది శ్రీనివాస్ విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో తెలంగాణలో పాదయాత్ర చేయడం కంటే, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కరువు సాయం తీసుకురావడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియతో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోందని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ఓట్ల తొలగింపు అంశంపై బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రామచందర్‌రావు పాదయాత్ర చేయాలనుకుంటే ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసం వద్ద, నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం వద్ద చేపట్టాలని వ్యాఖ్యానించారు.  తెలంగాణలో కరువు సాయం కింద రూ.20 వేల కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరిందని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో రాష్ట్ర బీజేపీ నాయకులు, ఎంపీలు తమ బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు.  మెట్రో రైలు, రీజినల్ రింగ్ రోడ్‌ (ట్రిపుల్ ఆర్‌), బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టుల విషయంలో కేంద్రం సహకరించడం లేదని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై స్పష్టత తీసుకురావాలని రామచందర్‌రావును డిమాండ్ చేశారు. నవంబర్ 1 నుంచి ప్రారంభించనున్న పాదయాత్రలో రైతులు కరువు సాయంపై బీజేపీ నాయకులను నిలదీయాలని ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు.