తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా)కు జాతీయ స్థాయి పురస్కారం
రామచంద్రపురం; సమాజాభివృద్ధి, ప్రజా సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా)కు జాతీయ స్థాయి పురస్కారం లభించింది. నివాసితుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు గత కొన్నేళ్లుగా చేపడుతున్న వినూత్న కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది.పౌర సమస్యల పరిష్కారం, పరిశుభ్రత, పచ్చదనం పెంపు, ప్రజారోగ్యం, సామాజిక సంక్షేమం వంటి అంశాల్లో ప్రభుత్వ శాఖలు, అధికారులు, సీఎస్ఆర్ సంస్థలతో కలిసి తేనా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.ఈ పురస్కారం తేనా నాయకత్వం, సభ్యులు, స్వచ్ఛంద కార్యకర్తలు, స్థానిక ప్రజలు, ప్రభుత్వ అధికారులు, సీఎస్ఆర్ భాగస్వాముల సమష్టి కృషికి దక్కిన గుర్తింపు అని అధ్యక్షుడు ఈశ్వరగారి రమణ తెలిపారు. ఈ అవార్డును తెల్లాపూర్ ప్రజలకు అంకితం చేస్తున్నామన్నారు.జాతీయ స్థాయి పురస్కారం తమ బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి తెల్లాపూర్‌ను పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన ఆరోగ్యకరమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రమణ పేర్కొన్నారు.