తలాబ్ చంచలం డివిజన్లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్
హైదరాబాద్ మేజర్ న్యూస్ :: యాకుత్ పురా నియోజకవర్గం పరిధిలోని సలాప్ చెంచాల డివిజన్లోని నషీమన్ నగర్, సిద్దిక్ నగర్, ఆమన్ నగర్, ప్రాంతంలో చేపడుతున్న అభివృద్ధి పనులను యాకుత్ పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరాజ్ సమీక్షించారు.తలాబ్ చెంచలం డివిజన్ లో నివసించే ప్రజలు తాగునీటి సరఫరాలో ఎదుర్కొంటున్న సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు
.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వాటర్ వర్డ్స్ ఇబ్బంది అధికారులకు సమస్యను తీసుకెళ్లడంతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించారు.నిటి సరఫరాలో అంతరాయానికి గల కారణాలను గుర్తించి, సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.సమస్య పరిష్కారం కావడంతో ప్రస్తుతం పలు కాలనీలలో నిటి సరఫరా సక్రమంగా అందుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ప్రజలకు ఎదురయ్యే తాగునీరు, రహదారులు, మౌలిక వసతుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు యాకుత్ పురా ఎమ్మెల్యే తెలిపారు...