తక్కువ నీటితో పండే పంటలపై దృష్టి పెట్టాలి*
*•ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా సాగు ప్రణాళికలు*
*•మాందాపురంలో రైతులతో టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ ముఖాముఖి*
*యాదాద్రి భువనగిరి ప్రతినిధి మేజర్ న్యూస్*
ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను తట్టుకునేందుకు రైతులు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ సూచించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం మాందాపురంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వాతావరణ మార్పులు, సాగునీటి అవసరాలు, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు.అధిక నీటి అవసరం ఉన్న వరి సాగుకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో పండే పంటలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. దీంతో భూగర్భ జలాల వినియోగం తగ్గడంతోపాటు వ్యవసాయ విద్యుత్ ఆదా అవుతుందని వివరించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు. సీఎండీ సూచనలపై రైతులు సానుకూలంగా స్పందించారు.కార్యక్రమంలో టీజీఎస్‌పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎన్.నరసింహులు, రూరల్ జోన్ చీఫ్ ఇంజినీర్ యు.బాలస్వామి, యాదాద్రి ఎస్‌ఈ కె.సురేష్ కుమార్, చౌటుప్పల్ డీఈ డి.మల్లికార్జున్, ఎంఆర్‌టీ డీఈ విజయభాస్కర్ రెడ్డి, రామన్నపేట ఏడీఈ కె.శ్రీకాంత్, ఏఈ జోగుల నర్సింహా, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, రైతులు పాల్గొన్నారు.