BREAKING
గ్లామరస్ ఫొటోషూట్‌తో అదరగొడుతున్న ప్రియాంక చోప్రా.. హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్న గ్లోబల్ స్టార్! ఎంపీటీసీ ఎన్నికలకు 21 నుండి నామినేషన్లు - ఎంపీడీవో జవహర్ బాబు సరికొత్తగా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్' వెబ్ సిరీస్.. సంచలన లుక్‌తో షనయా కపూర్ ఎంట్రీ! నాగర్ కర్నూల్ రామాలయంలో మంగళవారం దసరా శమీ పూజలు, వాహన పూజలు, అర్చనలు.… ప్రజల ఆశీర్వాదమే ఎన్డీఏ కూటమి బలం రాష్ట్ర అభివృద్ధే మా లక్ష్యం... ఓటీటీలోకి యామీ గౌతమ్ 'నయ్యి నవెల్లి'.. డిజిటల్ స్ట్రీమింగ్ అప్‌డేట్ వచ్చేసింది! నాగర్ కర్నూల్ లో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల నిరసన లో తల్లులకు తోడుగా కూతుళ్లు నెల్లుట్ల గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు-సర్పంచ్ నర్సింగ రామకృష్ణ పని అడగడానికి సిగ్గుపడను.. నటనకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంచుతా అంటున్న స్మృతి ఇరానీ జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసిన ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి* వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులతో మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఆత్మీయ భేటీ ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణాల మోత.. అంబరాన్నంటిని బతుకమ్మ సంబరాలు-విజేతలకు బహుమతులు అందజేసిన స్వయంకృషి సంస్థ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలి కోమటి చెరువు పై అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ..!

తాళ్లపేటలో బతుకమ్మ వేడుకల్లో ఘర్షణ

Select Suryaa Now
తాళ్లపేటలో బతుకమ్మ వేడుకల్లో ఘర్షణ

 

సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో బతుకమ్మ సంబురాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు (పీఎస్ఆర్) వర్గీయులకు, మంత్రి వివేక్ ప్రధాన అనుచరుడు జగన్మోహన్ వర్గీయులకు మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలో మహిళలు భయంతో పరుగులు తీయగా, కొందరు కిందపడి గాయపడినట్లు సమాచారం. సీఐ తమపై లాఠీతో దాడి చేశారని ఆరోపిస్తూ మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, గిరిజన మహిళా సర్పంచ్ కుర్సింగ కళావతి, ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతి నిరసనకు దిగారు.

• సీఐ సస్పెన్షన్‌కు డిమాండ్‌

ఈ ఘటన నేపథ్యంలో జగన్మోహన్, జీసీసీ మాజీ చైర్మన్ కొట్నాక తిరుపతి తాళ్లపేటకు చేరుకుని తమ వర్గీయులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సీఐ రమణమూర్తిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు పీఎస్ఆర్ వర్గీయులు బస్టాండ్ వద్ద నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జిల్లా నలుమూలల నుంచి పోలీసులను రప్పించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా ప్రారంభమైన వివాదం కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుగా మారడం స్థానికంగా చర్చనీయాంశమైంది.