సుబ్బారావుపేట గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ.
సుబ్బారావుపేట గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ.
దుమ్ముగూడెం,సూర్య (మేజర్ న్యూస్)::
మండలంలోని సుబ్బారావు పేట గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. మహిళలు పూలతో బతుకమ్మలను అందంగా తీర్చిదిద్ది ప్రత్యేక పూజలు చేశారు.సంప్రదాయ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ గ్రామ ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.అనంతరం గ్రామ చివర్లోనే చెరువు వద్ద భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ టీ లలిత ఆదివాసి జాగృతి మహిళా అధ్యక్షురాలు పాయం నందిని,మహిళలు, ఉద్యోగస్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దుమ్మగూడెం సూర్య రిపోర్టర్… కల్లూరి సుమన్.