BREAKING
ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధికి బాటలు వేస్తా భారత్‌–అమెరికా సంబంధాలకు ప్రజాస్వామ్య సంస్థలే బలమైన పునాది: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఇటలీ అంతర్జాల దాడులకు బాధ్యులెవరో స్వతంత్రంగా నిర్ధారించాల్సి ఉంది.. సాంకేతిక దర్యాప్తులో కీలక అంశాలు! ఏపీలో 601 ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు పూర్తి.. ఒకే రోజు థియేటర్లలో మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు! పొన్నూరు 37వ వార్డులో జోరందుకున్న వైసీపీ ఎన్నికల ప్రచారం ప్రచారంలో పాల్గొన్న వైసీపీ చైర్మన్ అభ్యర్థి షేక్ నాజిని సిద్ధిపేట.. ఇక కాంగ్రెస్ అడ్డా.. బ్యాచులర్ పార్టీ డ్యూక్స్ రివ్యూ.. 14 ఏళ్ల తర్వాత అమల్ నీరద్ స్టైలిష్ యాక్షన్ ఎలా ఉందంటే? అన్నారంలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ రుద్ర సహిత కాలబైరవ మహా యజ్ఞంకు విస్తృత ఏర్పాట్లు ఓం సినిమాకు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్.. తెలుగు వెర్షన్‌కే అగ్రస్థానం! శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం శరీరానికి ఉపవాసం..మనసుకు నామస్మరణ.. ఆత్మకు ఆధ్యాత్మిక చింతన..అనుగ్రహించేదే.. మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం హెయిల్ మేరీ నుంచి మారివిల్ చిరకే వీడియో సాంగ్ విడుదల.. సూరజ్ వెంజారమూడు భావోద్వేగ నటన!

సిద్దిపేట జిల్లాలో రూ.544.11 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. పూర్తయిన పనులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Select Suryaa Now
సిద్దిపేట జిల్లాలో రూ.544.11 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం  పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. పూర్తయిన పనులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
సిద్దిపేట,ప్రతినిధి : సిద్దిపేట జిల్లాలో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ రూ.544.11 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. జిల్లాలో రూ.451.13 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు, రూ.92.98 కోట్లతో పూర్తయిన పనులను ప్రారంభించారు. విద్య, రెవెన్యూ, విద్యుత్ రంగాల బలోపేతమే లక్ష్యంగా పలు నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు కేటాయించింది.
రూ.451.13 కోట్లతో నూతన పనులకు శంకుస్థాపన..
దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో రూ.200 కోట్ల చొప్పున రెండు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.15.44 కోట్లు, ఆరు తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి రూ.13.50 కోట్లు కేటాయించారు.
దౌల్తాబాద్ మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి రూ.7.80 కోట్లు, చిన్నకోడూరు మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి రూ.7.50 కోట్లు మంజూరు చేశారు. జనగామ నియోజకవర్గంలో మూడు విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి రూ.6.89 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
రూ.92.98 కోట్ల పనులు ప్రారంభం.
ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో జిల్లాలో రూ.92.98 కోట్లతో పూర్తయిన పలు పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో 14 విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి రూ.54.67 కోట్లు, కొమురవెల్లి మల్లన్న ఆలయ సత్రం నిర్మాణానికి రూ.14.35 కోట్లు, క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.12 కోట్లు వెచ్చించారు.అలాగే రూ.6.50 కోట్లతో 53 గ్రామ సంఘాల భవనాలు, రాయపోల్ మండలంలో రూ.3.87 కోట్లతో నూతన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనం, గజ్వేల్‌లో రూ.1.59 కోట్లతో విద్యుత్ డివిజన్ కార్యాలయాన్ని నిర్మించారు.
ఇందిరా గాంధీకి నివాళులు..
స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కార్యక్రమ వేదికపై ఆమె చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. సభా ప్రాంగణంలో ప్రభుత్వ దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ముఖ్యమంత్రికి కొమురవెల్లి మల్లన్న చిత్రపటాన్ని అందజేశారు.

 
పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి వివేక్ వెంకటస్వామి..

 
జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామని, వచ్చే ఏడాది మరో రెండు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. గత పదేళ్లలో కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు లక్షల కొత్త చేయూత పెన్షన్లు అందించిందన్నారు.వృద్ధులు, దివ్యాంగులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులకు పెన్షన్లు అందించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభించామని, విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు రూ.13 వేల కోట్ల వ్యయంతో సన్నబియ్యం పంపిణీ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామని, కార్మికుల సంక్షేమం కోసం కనీస వేతనాలను సవరించామని చెప్పారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో రూ.4,500 కోట్ల వ్యయంతో అన్ని నియోజకవర్గాల్లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు పెండింగ్ నష్టపరిహారం ప్రకటించి న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. సిద్దిపేట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

 
నిర్వాసితులకు పెండింగ్ పరిహారం అందించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్..

 
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గౌరవెల్లి, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నష్టపరిహారాలు, భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధితులకు పెండింగ్ పరిహారం అందించి న్యాయం చేయాలన్నారు.హుస్నాబాద్ ప్రాంతాన్ని గతంలో కరీంనగర్ జిల్లా నుంచి సిద్దిపేట జిల్లాలో కలిపారని ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో జిల్లాల పునర్విభజన జరిగితే హుస్నాబాద్‌ను తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపాలన్నది ప్రజల ఆకాంక్షగా పేర్కొన్నారు.

 
పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..

 
పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రూ.5 లక్షల కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు.కాళేశ్వరం, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టుల భూసేకరణ, నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని, బాధితులకు న్యాయం చేసిన తర్వాతే ప్రజలను ఓట్లు అడగాలని అన్నారు. సిద్దిపేటకు న్యాయం చేయాలంటే కేవలం లేఖలు రాయడం కాకుండా బాధ్యతలు స్వీకరించి అభివృద్ధి చేయాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ముందుకు సాగుతాయని అన్నారు.

 
సిద్దిపేట అభివృద్ధికి రూ.545 కోట్లు: మంత్రి దామోదర రాజనర్సింహ..m

 
ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ నవంబర్ 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేటలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1980లో మెదక్ ఎంపీగా ఇందిరా గాంధీ విజయం సాధించడం, సిద్దిపేటతో ఆమెకున్న అనుబంధాన్ని గుర్తుచేశారు.ప్రజా ప్రభుత్వం సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధికి సుమారు రూ.545 కోట్లతో పనులు చేపడుతోందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక భద్రత, మహిళా సాధికారత ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని దండగ నుంచి పండుగగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల కింద 18 గ్రామాలు, సుమారు 20 వేల ఎకరాలు కోల్పోయిన నిర్వాసితుల పోరాటాన్ని మంత్రి గుర్తుచేశారు. జీవో 123కు వ్యతిరేకంగా నిర్వాసితులు 963 రోజుల పాటు నిరాహార దీక్షలు, న్యాయపోరాటం చేశారని తెలిపారు. వారి పోరాట ఫలితంగా మూడు ఆర్‌అండ్‌ఆర్ కాలనీలు, 600 ఇళ్లు, 7 వేల ప్లాట్లు నిర్మించారని చెప్పారు. మిగిలిన పునరావాస పనులను త్వరితగతిన పూర్తి చేసి నిర్వాసితులకు న్యాయం చేస్తామని, వారి సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కె. హైమావతి, పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కూజల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.