BREAKING
ఎన్నికల నియమావళికి తూట్లు! శిలాఫలకాలను కప్పడంలో అధికారుల నిర్లక్ష్యం ఎంపీడీవో పర్యవేక్షణ ఎక్కడని స్థానికుల ప్రశ్నలు అధికారుల నిర్లక్ష్యం అదుపుతప్పి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద సూచిక బోర్డు లేక రోడ్డు ప్రమాదం స్పీడ్ బ్రేకర్ వద్ద కారును ఢీకొట్టిన బస్సు. బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం కీలక ఆదేశాలు.. నేడు మోదీ నివాసంలో భేటీ! రేపు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు.. ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి అదిత పాయసంపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ శామ్‌సంగ్ తొలి హ్యూమనాయిడ్ రోబోట్ సిద్ధం 29.11.2026 నుండి 05.12.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) | weekly horoscope by Dr Edupuganti Padmaja Rani తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. అమెరికా బలగాలపై దాడులకు ఇరాన్ స్టార్‌లింక్ వినియోగం ట్రంప్ కుటుంబ మద్దతున్న వరల్డ్ లిబర్టీ క్రిప్టో టోకెన్ కుప్పకూలింది వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఎలుగుబంటి. ఉక్రెయిన్‌ నుంచి స్వీడన్‌ సంస్థ సాబ్‌కు రూ.4,100 కోట్ల రాడార్ ఆర్డర్ భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం

శేరిలింగంపల్లిలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు దుర్గామాత మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే గాంధీ

Select Suryaa Now
 శేరిలింగంపల్లిలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు దుర్గామాత మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే గాంధీ

శేరిలింగంపల్లి,మేజర్ న్యూస్ :  శేరిలింగంపల్లి నియోజకవర్గంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ,గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీ,చందానగర్ డివిజన్ పరిధిలోని విద్యానగర్ కాలనీ,భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎంఐజి  కాలనీలలో  ఏర్పాటు చేసిన పలు దుర్గామాత మండపాలను ఎమ్మెల్యే గాంధీ సందర్శించారు.

 ఈ సందర్భంగా అమ్మవారిని మాజీ కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్,నార్నె శ్రీనివాస్ రావు, రఘునాథ్ రెడ్డి,మారబోయిన రాజు యాదవ్, దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఎమ్మెల్యే గాంధీ  మాట్లాడుతూ, దుర్గామాత అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

 శేరిలింగంపల్లి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక వేడుకలకే పరిమితం కాకుండా ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం, సామాజిక సమైక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్,నాయకులు మల్లేష్ యాదవ్, మల్లేష్, నరేందర్ బల్ల, పవన్ ,మల్లేష్, విజయ్,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.