BREAKING
పెరిగిన బియ్యం ధరలను తక్షణమే అదుపు చేయాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి నేడు ప్రజావాణి కార్యక్రమం విప్పమనుపట్టెడ సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రామస్థుడి ఫిర్యాదు అమెరికాలో మూడో రోజు కొనసాగుతున్న విమాన ప్రయాణాల అంతరాయం విజ్ఞాన సమాజమే దేశ అభివృద్ధికి పునాది రష్యా కుట్రల నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి సరిహద్దులను మూసివేయనున్న ఎస్టోనియా 16న పిల్లల ప్రజావాణి సింగపూర్, మలేషియా దేశాలకు క్షమాపణలు తెలిపిన ఇండోనేషియా అధ్యక్షుడు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులుగా గూట్ల తిరుపతి హూతీ వ్యతిరేక బలగాల వెనుకంజ, బహ్రెయిన్‌పై ఇరాన్ దాడుల కలకలం అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ. మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన ఇనగాల మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర

సెయింట్ థెరిస్సా పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
సెయింట్ థెరిస్సా పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

సంగారెడ్డి;సంగారెడ్డి లోని సెయింట్ థెరిస్సా పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు విద్యార్థులు, తల్లిదండ్రుల ఆనందోత్సాహాల మధ్య కనుల పండువగా సాగాయి.ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా ఆటపాటలు, నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రత్యేకంగా తల్లిదండ్రుల కోసం నిర్వహించిన ఆటపాటలు, వినోద కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులలో సృజనాత్మకతను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు. బాలల దినోత్సవ వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో ముగిశాయి.