BREAKING
పెరిగిన బియ్యం ధరలను తక్షణమే అదుపు చేయాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి నేడు ప్రజావాణి కార్యక్రమం విప్పమనుపట్టెడ సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రామస్థుడి ఫిర్యాదు అమెరికాలో మూడో రోజు కొనసాగుతున్న విమాన ప్రయాణాల అంతరాయం విజ్ఞాన సమాజమే దేశ అభివృద్ధికి పునాది రష్యా కుట్రల నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి సరిహద్దులను మూసివేయనున్న ఎస్టోనియా 16న పిల్లల ప్రజావాణి సింగపూర్, మలేషియా దేశాలకు క్షమాపణలు తెలిపిన ఇండోనేషియా అధ్యక్షుడు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులుగా గూట్ల తిరుపతి హూతీ వ్యతిరేక బలగాల వెనుకంజ, బహ్రెయిన్‌పై ఇరాన్ దాడుల కలకలం అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ. మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన ఇనగాల మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర

సెయింట్ పాల్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
సెయింట్ పాల్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

 సదాశివపేట;సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామంలోని సెయింట్ పాల్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ రోజా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు విద్యార్థుల సందడి, ఉత్సాహంతో అట్టహాసంగా సాగాయి.ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల వేషధారణలతో అలరించడంతో పాటు ఆటపాటలు, ఆకట్టుకునే నృత్య ప్రదర్శనలతో అదరగొట్టారు. చిన్నారుల రంగురంగుల వేషధారణలు, చక్కటి నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమలోని ప్రతిభను ప్రదర్శించారు.ఈ సందర్భంగా కరస్పాండెంట్ రోజా మాట్లాడుతూ బాలలే భావి భారత పౌరులని, వారి ఆనందమే సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. వేడుకలు ఉల్లాసభరిత వాతావరణంలో ముగిశాయి.