BREAKING
గంటలో పెళ్లి కాకపోతే వెళ్లిపోతానన్న పంకజ్ కపూర్.. ఆసక్తికర విషయం చెప్పిన సుప్రియా పాఠక్! కోటి సోమవారం వేడుకలకు పోటెత్తిన భక్తజనం పశ్చిమాసియాలో అమెరికా మరో నౌకాదళ మోహరింపు దుబాయ్‌లో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం.. యూఏఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం వరుసగా మూడు గ్రామ పంచాయతీ సమావేశంలో గైర్హాజరు - 11వ వార్డు సభ్యుడికి అనర్హత నోటీసు ముంబైలో ఛఠ్ పూజ వేడుకల్లో తమన్నా భాటియా.. 'ది వాన్' పాటపై ఆసక్తికర మాటలు! ఎన్విడియా, మైక్రోసాఫ్ట్‌ సహా రెండు డజన్లకు పైగా కంపెనీలకు అమెరికా 'జాతీయ ఛాంపియన్‌' హోదా అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా -- సంక్షేమ పథకాలు అందిస్తున్నాం -- ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి 2001 గుజరాత్ భూకంపం తర్వాత కచ్ పునర్నిర్మాణ అద్భుతం రైతుల సంక్షేమమే లక్ష్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం - వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్ నేను నటినన్న విషయాన్ని పరిశ్రమ మర్చిపోయింది.. దర్శకత్వంపై కష్మీరా షా ఆసక్తికర వ్యాఖ్యలు! బాదంపల్లిలో వివో భవన నిర్మాణానికి భూమి పూజ స్థానిక ఎన్నికలకు టీడీపీ వ్యూహరచన! అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందించడమే లక్ష్యం - రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భారత్‌లో పర్యటిస్తున్న బెలారస్ విదేశాంగ మంత్రి

సగరులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలి

Select Suryaa Now
సగరులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలి

రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలోని సగర (ఉప్పర) సామాజిక వర్గాన్ని ప్రస్తుతం బీసీ-డీ కేటగిరీలో కొనసాగిస్తున్న నేపథ్యంలో, అత్యంత వెనుకబడిన తరగతులైన బీసీ-ఏ గ్రూపులోకి పునర్వర్గీకరించాలని రంగారెడ్డి జిల్లా సగర సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా నారాయణరెడ్డికి సంఘం జిల్లా అధ్యక్షుడు బల్గురి యాదగిరి సాగర్ ఆధ్వర్యంలో సమగ్ర వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సగర సమాజం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి సమస్యలను వినతిపత్రంలో వివరించారు. శతాబ్దాలుగా బావులు తవ్వడం, చెరువులు, కాలువలు నిర్మించడం, మట్టి, రాతి పనులు చేయడం వంటి సంప్రదాయ వృత్తులపై ఆధారపడిన సగరులు ఆధునిక యంత్రాల రాకతో ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. ప్రస్తుతం చాలామంది భవన నిర్మాణ రంగంలో అసంఘటిత కార్మికులుగా పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

బీసీ-డీ కేటగిరీలోని ఇతర సామాజిక వర్గాలతో పోటీ పడలేక విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సగరులకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1986లో మురళీధర రావు కమిషన్ సిఫార్సుల మేరకు సగరులను బీసీ-ఏలో చేర్చిన విషయాన్ని, అలాగే 2009లో పూసల కులాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చిన ప్రభుత్వ ఉత్తర్వులను వినతిపత్రంలో ప్రస్తావించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని శాస్త్రీయ గణాంకాల ఆధారంగా సగరుల వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసి ప్రభుత్వానికి, రాష్ట్ర బీసీ కమిషన్‌కు సానుకూల సిఫార్సు చేయాలని కోరారు.

సంఘం ప్రధాన డిమాండ్లు ఇవే..

సగర ఫెడరేషన్‌ను పూర్తిస్థాయి సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌గా మార్చి ప్రత్యేక పాలకమండలిని నియమించాలని, తగిన బడ్జెట్ కేటాయించాలని కోరారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో సగర లేబర్ కో-ఆపరేటివ్ సొసైటీలకు ప్రాధాన్యత కల్పించేలా జీవో 59ను సవరించి రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు.

నిర్మాణ రంగంలో పనిచేస్తున్న సగర కార్మికులందరికీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా లేబర్ కార్డులు అందించాలని, ప్రత్యేక ఆరోగ్య భద్రత కార్డులు, ప్రమాద బీమా, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని పేర్కొన్నారు.

అలాగే హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై శ్రీశ్రీశ్రీ సగర భగీరథ మహర్షి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, రంగారెడ్డి జిల్లా కేంద్రంలో సగర విద్యార్థుల కోసం హాస్టల్, సామాజిక కార్యక్రమాల నిర్వహణకు కమ్యూనిటీ భవనం నిర్మించేందుకు ఒకటి నుంచి రెండు ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించాలని కోరారు.

జిల్లాలోని సగర కుటుంబాల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక రూపొందించాలని, అర్హులైన కార్మికులకు సంక్షేమ పథకాలు అందేలా ప్రత్యేక నమోదు కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.

సగర సమాజానికి విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించి సామాజిక న్యాయం చేకూర్చేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని సంఘం నాయకులు కోరారు. ఈ వినతిపత్రం ప్రతులను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ తదితరులకు కూడా పంపించారు.

వడ్ల శ్రీనివాస చారి : రంగారెడ్డి - మేజర్ న్యూస్