BREAKING
అధికారుల నిర్లక్ష్యం అదుపుతప్పి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద సూచిక బోర్డు లేక రోడ్డు ప్రమాదం స్పీడ్ బ్రేకర్ వద్ద కారును ఢీకొట్టిన బస్సు. బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం కీలక ఆదేశాలు.. నేడు మోదీ నివాసంలో భేటీ! రేపు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు.. ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి అదిత పాయసంపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ శామ్‌సంగ్ తొలి హ్యూమనాయిడ్ రోబోట్ సిద్ధం 29.11.2026 నుండి 05.12.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) | weekly horoscope by Dr Edupuganti Padmaja Rani తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. అమెరికా బలగాలపై దాడులకు ఇరాన్ స్టార్‌లింక్ వినియోగం ట్రంప్ కుటుంబ మద్దతున్న వరల్డ్ లిబర్టీ క్రిప్టో టోకెన్ కుప్పకూలింది వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఎలుగుబంటి. ఉక్రెయిన్‌ నుంచి స్వీడన్‌ సంస్థ సాబ్‌కు రూ.4,100 కోట్ల రాడార్ ఆర్డర్ భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం న్యూజిలాండ్ రాజకీయాల్లో కీలక మలుపు

సద్దుల బతుకమ్మను భద్రంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి

Select Suryaa Now
సద్దుల బతుకమ్మను భద్రంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి

సూర్య కాల్వ శ్రీరాంపూర్ :సద్దుల బతుకమ్మ, విజయదశమి పండుగలను ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఆనందోత్సాహల మధ్య సురక్షితంగా జరుపుకోవాలని ఎస్సై గట్ల సుధాకర్ అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గ్రామ ప్రజలందరికీ ఆయన  మహార్నవమి, విజయదశమి పండుగల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు కొన్ని సూచనలు, జాగ్రత్తలు, నిబంధనలు తెలియజేశారు.

మహిళల భద్రత: మహిళలు చైన్ స్నాచింగ్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వారు బంగారు ఆభరణాలు వేసుకొని బయటకు వచ్చేటప్పుడు, తిరిగి వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

ఇంటి భద్రత: పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్ళేటప్పుడు, బతుకమ్మ ఆడు కునేందుకు వెళ్లేటప్పుడు ఇంటికి, బీరువాకు తాళాలు వేసిన తర్వాత తాళం చెవిని అక్కడే వదిలి వెళ్లే పొరపాటు చేయకూడదు.

రోడ్డు భద్రత: ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. దీనిని ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు తీసుకొనబడును.

శాంతి భద్రతలు: పండుగలను సంతోషంగా జరుపుకునే వాతావరణంలో ఎలాంటి గొడవలు, సృష్టించకుండా ప్రశాంతంగా వేడుకలు జరుపు కోవాలి. గ్రామ సర్పంచులు వీటిని తమ బాధ్యతగా స్వీకరించి ఈ విషయాలను ఆయా గ్రామాల ఆలయ మైకుల ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. పండుగలు జరుపుకునేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు.