సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం
సూర్య చింతల మానేపల్లి :కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం బూరుగుడ గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం చోటుచేసుకుంది.బతుకమ్మ ఆడుతున్న సమయంలో చింతలమానేపల్లి మండలం బాబాసాగర్కు చెందిన శ్రీవాణి (25) స్పృహతప్పి కిందపడింది.చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆమె మేనత్త ఇంటికి వచ్చింది...వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు స్థానికులు తెలిపారు....