telangana
రోడ్డు ప్రమాదంలో విద్యుత్ శాఖ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మృతి
సూర్య కరీంనగర్ : కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలోని కృష్ణానగర్‌కు చెందిన విద్యుత్ శాఖ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ర్యాకం శంకర్ (46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విధులు ముగించుకుని గ్లామర్ బైక్‌పై ఇంటికి వెళ్తుండగా లారీ అసోసియేషన్ సమీపంలో రోడ్డు దాటే సమయంలో గోదావరిఖని వైపు నుంచి పల్సర్ బైక్‌పై అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన మహమ్మద్ తాజొద్దీన్ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శంకర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.మృతుడి భార్య శారద ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు ఆసుపత్రిలోనే ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదం జరిగిన వెంటనే నిందితుడు పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని, అతడిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి రోడ్డు డైవర్షన్లు, డివైడర్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు సంబంధిత శాఖకు నివేదిక అందించనున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు రోడ్డు దాటే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.