telangana
అగ్నిమాపక సిబ్బంది సంక్షేమానికి టీఎన్జీవోలు, ఉద్యోగుల జేఏసీ అండ
సూర్య కరీంనగర్ : తెలంగాణ అగ్నిమాపక, విపత్తు స్పందన, అత్యవసర సేవలు, పౌర రక్షణ శాఖ కరీంనగర్ జిల్లా ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. స్థానిక టీఎన్జీవో కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా ఎం.డి. తబ్రేజ్, ఉపాధ్యక్షుడిగా జి. గణేష్, కార్యదర్శిగా పి. శ్రీధర్ రెడ్డి, కోశాధికారిగా వి. శ్రీనివాస్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అగ్నిమాపక సిబ్బంది సంక్షేమం, ఆరోగ్య, ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను రాష్ట్ర జేఏసీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.నూతన కార్యవర్గం మాట్లాడుతూ సిబ్బందికి ఆధునిక రక్షణ పరికరాలు, ప్రత్యేక ఆరోగ్య బీమా, ప్రమాద భృతి, పని గంటల క్రమబద్ధీకరణ కోసం కృషి చేస్తామని పేర్కొంది. కార్యక్రమంలో టీఎన్జీవోల రాష్ట్ర నాయకులు జి. దామోదర్ రెడ్డి, వి. శ్రీనివాస్, పి. శ్రీనివాస్, కృష్ణ, సర్దార్ హర్విందర్ సింగ్, మారుపాక రాజేష్ భరద్వాజ్, కోట రామస్వామి తదితరులు పాల్గొన్నారు.