telangana
నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
సూర్య కరీంనగర్ : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నవంబర్ 28న ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా జిల్లా ఉపాధి కార్యాలయం, TASK, Dept of ITEC ఆధ్వర్యంలో నవంబర్ 28న జిల్లా ఓల్డ్ కలెక్టరేట్ ఆడిటోరియం కరీంనగర్ ఆవరణలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు.జాబ్ మేళా కార్యక్రమానికి IT, ITES, నాన్-IT రంగాలకు చెందిన 15 కంపెనీలు హాజరుకానున్నాయని, డిగ్రీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ITI, డిప్లొమా తదితర కోర్సులు 2023 నుండి 2026 లో పూర్తి చేసిన నిరుద్యోగ యువత జాబ్ మేళాకు హాజరు కావాలని కలెక్టర్ సూచించారు.కంపెనీ ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి వివిధ ఉద్యోగ అవకాశాలకు ఎంపిక చేయనున్నారని తెలిపారు. అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలోని ఆసక్తిగల నిరుద్యోగ యువత నవంబర్ 28న నిర్వహించే మెగా జాబ్ మేళాకు 3 నుంచి 4 సెట్ల రెస్యూమ్ కాపీలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.