BREAKING
అక్షయ్ కుమార్‌ను ‘అనూప్ జలోటా’ అంటూ ఆటపట్టించిన ట్వింకిల్ ఖన్నా.. పారితోషికం లేకుండా కాఫీ విత్ కరణ్ షోకి వెళ్లావంటూ ఫన్నీ రోస్ట్! మాటలు చాలని చోట సంగీతమే మాట్లాడుతుంది పేద రోగికి ఉచితంగా మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స సీజేపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.. దీప్కే, రాంకా, సౌరవ్‌లకు లుకౌట్ నోటీసులు జారీ ఇఫ్ఫీ 2026లో మన శంకర వరప్రసాద్ గారు విశేషాలపై అనిల్ రావిపూడి వ్యాఖ్యలు బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో  ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు భాయ్ బంద్ సినిమాతో సోదరభావం, ఆధునికతపై ఆసక్తికర కథనం కురుమ యువ చైతన్య సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా ఎల్కపెల్లి రమేష్ నియామకం ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 15 రోజుల పితృత్వ సెలవులు మంజూరు డప్పు చాటింపుతో దీక్షా దివస్ సభకు ఆహ్వానం - మాజీ మంత్రి గంగుల కమలాకర్ డప్పు చాటింపుతో దీక్షా దివస్ సభకు ఆహ్వానం - మాజీ మంత్రి గంగుల కమలాకర్ బాప్యా సినిమాతో ఆమోదం, లింగ గుర్తింపుపై కొత్త చర్చ అమరవీరుడు కిష్టయ్య త్యాగం మరువలేనిది - వర్ధంతి పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ కాశీ తమిళ సంగమం ఐదో ఎడిషన్ నవంబర్ 28న ప్రారంభం

ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి - పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం

Select Suryaa Now
ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి - పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం
సూర్య కరీంనగర్ ప్రతినిధి : ఈ నెల 29న ఆదివారం నిర్వహించనున్న ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, పోలీస్ నోడల్ అధికారులు, బయోమెట్రిక్ సిబ్బందితో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు.జిల్లావ్యాప్తంగా 12 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 20 పరీక్షా కేంద్రాల్లో 14 వేల మందికి పైగా అభ్యర్థులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రతి అభ్యర్థి బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా నమోదు చేయాలని, సాంకేతిక సమస్యలు తలెత్తితే ప్రత్యామ్నాయంగా మాన్యువల్ విధానాన్ని అనుసరించాలని సూచించారు.పరీక్షా కేంద్రాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని, విధుల్లో ఉన్న సిబ్బంది గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశించారు. కేంద్రాల్లో సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంపై నిషేధం విధించారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ నిషేధాజ్ఞలు అమలు చేయడంతో పాటు జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయాలని, పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24 గంటల సీసీటీవీ నిఘా, సాయుధ బలగాల పహారా ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులకు తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.పరీక్ష విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీపీ సూచించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ సృజన్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వరలక్ష్మి, అడిషనల్ కోఆర్డినేటర్ రజిని, ఫింగర్ ప్రింట్ యూనిట్ ఇన్‌స్పెక్టర్ రాజు, ఎస్సై నరేష్ తదితరులు పాల్గొన్నారు.