రావణ దాహనంలో పాల్గొన్న శాసనసభ్యులు పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : చెడు పై మంచి కి విజయం లభించడం తధ్యయమని దసరా పర్వదినం విశిస్టత చాటుతుందని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు. తుకారాం గెట్ లో పహాడీ హనుమాన్ దేవాలయం వద్ద దసరా వేడుకల్లో పద్మారావు గౌడ్ పాల్గొని, రావణ దాహానానికి హాజరయ్యారు. కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్, బీ. ఆర్. ఎస్. యువ నేత రామేశ్వర గౌడ్, మాజీ కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్, పహాడీ హనుమాన్ డెవలప్మెంట్ కమిటీ ఛైర్మన్ నక్క మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలిపారు.