రాజీవ్ గాంధీ నగర్ టేకుచెట్ల బజారులో సద్దుల బతుకమ్మ సంబరాలు
మణుగూరు ఆర్ సి సూర్య ; మణుగూరు రాజీవ్ గాంధీ నగర్ టేకుచెట్ల బజారులో సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడపడుచులు అంతా ఒకచోట చేరి భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పూజించారు.ఆట పాటలతో ఆ ప్రాంగణమంతా మార్మోగింది. తెలంగాణ ప్రజల సంస్కృతికి,సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే పూల పండుగలో ఆ ఏరియా కుటుంబాలు పాల్గొని సందడి చేశారు.
పొనగంటి కృష్ణ మణుగూరు ఆర్ సి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా