BREAKING
వరుణ్ సందేశ్ యద్భావం తద్భవతి చిత్రం నుండి జిజెన్ చిక సాంగ్ విడుదల మున్నూరు కాపు  పటేల్స్ సంఘం ఎన్నికల రాష్ట్ర కోఆర్డినేటర్ గా కాస రాజు పటేల్ నియామకం కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం కోటి 23 లక్షలు. పోక్సో చట్టంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించిన పోలీస్ కమిషనర్... ఎయిడ్స్ నియంత్రణలో కామారెడ్డి జిల్లా బేష్ కలెక్టర్ ను అభినందించిన కేంద్రం మాధవనగర్ ఆర్వోబి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలుకు తీవ్ర ఇబ్బందులు జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించాలి జిల్లా కలెక్టర్ కె.హరిత నువ్వూరుపాడు సెగ్మెంట్ అభివృద్ధి లక్ష్యం 21వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా జనసేన అభ్యర్థి వరలక్ష్మి ఇండో–శ్రీలంక మైత్రి సేతు సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. గంజాయి సాగు, రవాణాను అరికట్టాలి జిల్లా కలెక్టర్ కె.హరిత భారీ సెటిల్‌మెంట్‌ కింద 220 మిలియన్ డాలర్లు చెల్లించనున్న ఆటోమొబైల్ దిగ్గజం జీఎం! జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించాలి... జిల్లా కలెక్టర్ కె.హరిత

ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా చేపట్టాలి

Select Suryaa Now
ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా చేపట్టాలి

 

• జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ 

సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి :

ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో జి.ఓ. నం. 59, 76 అమలుపై జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ లతో కలిసి సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ, సింగరేణి భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్న నిబంధనలు, అర్హతలు, నిర్దేశిత గడువులకు అనుగుణంగా ప్రక్రియను చేపట్టాలని సూచించారు. నిర్దేశిత కటాఫ్ తేదీకి ముందుగా జరిగిన ఆక్రమణలకు మాత్రమే, సంబంధిత జి.ఓ. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న సందర్భాలలో క్రమబద్ధీకరణ చేపట్టాలని తెలిపారు. భూముల క్రమబద్ధీకరణకు ముందు సంబంధిత భూమి అటవీ భూముల పరిధిలోకి వస్తుందా/లేదా అనే విషయాన్ని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని, అటవీ భూములకు సంబంధించిన చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అన్ని అంశాలను నిర్ధారించిన అనంతరమే నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలని తెలిపారు. జి.ఓ. నం. 59 ప్రకారం 500 చదరపు గజాల లోపు విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణల క్రమబద్ధీకరణకు సంబంధించి నిర్దేశించిన నిబంధనలు, అర్హతలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. జి.ఓ. నం. 76కు సంబంధించి తహసిల్దార్లు, సింగరేణి అధికారుల సమన్వయంతో క్రమబద్ధీకరణ ప్రక్రియను కొనసాగించాలని, సింగరేణి ఉద్యోగులు కాని వారు సింగరేణి క్వార్టర్లలో నివాసం ఉంటున్నట్లయితే, నిబంధనల ప్రకారం వాటిని ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సింగరేణి నిర్మాణాలలో నివాసం ఉంటున్న వారికి సంబంధిత మున్సిపాలిటీల ద్వారా ఆస్తి పన్ను విధించడం, ఇంటి నంబర్లు కేటాయించడం వంటి అంశాలను పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి చర్యలు జరిగినట్లు గుర్తిస్తే, సంబంధిత మున్సిపల్ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూముల క్రమబద్ధీకరణలో పారదర్శకత పాటిస్తూ, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, సింగరేణి అధికారులు, తహసిల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.