BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా విజయదశమి వేడుకలు

Select Suryaa Now
ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా విజయదశమి వేడుకలు

కోహీర్;సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని చింతల్‌గట్టు గ్రామంలో విజయదశమి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామ ప్రజలు సంప్రదాయబద్ధంగా దసరా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా గ్రామంలో ఎటుచూసినా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అన్నదమ్ములు ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకోగా, అక్కాచెల్లెళ్లు, అమ్మలు, బంధుమిత్రులు ఆప్యాయంగా పలకరించుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.విజయదశమి పర్వదినాన జమ్మి వృక్షానికి పూజలు చేయడం మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాల్లో విశిష్టమైన ఆచారం. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ చింతల్‌గట్టు గ్రామ ప్రజలు గ్రామం చివరన ఉన్న వ్యవసాయ పొలంలోని జమ్మి వృక్షం వద్దకు ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడ జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీరామ నామస్మరణతో భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.ఈ సందర్భంగా *“శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం.. అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం”* అనే శమీ వృక్ష మహిమను స్మరించుకుంటూ జమ్మి ఆకులను సేకరించారు. అనంతరం గ్రామస్తులు ఒకరికొకరు జమ్మి ఆకులను అందజేస్తూ బంగారం లాంటి శుభాలు కలగాలని ఆకాంక్షించారు. పెద్దలకు గౌరవం తెలుపుతూ, చిన్నలను ఆప్యాయంగా పలకరిస్తూ, బంధుత్వంలోని మాధుర్యాన్ని చాటుకున్నారు.దసరా పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా, కుటుంబ బంధాలను బలోపేతం చేసే, గ్రామీణ ఐక్యతను చాటిచెప్పే గొప్ప పండుగగా నిలుస్తుందని గ్రామస్తులు తమ ఆచరణ ద్వారా చాటిచెప్పారు. కాలం మారుతున్నా తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను మరువకుండా, భావితరాలకు వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తూ జమ్మి పూజలను నిర్వహించడం విశేషం.ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు మన నాగరికతకు చిహ్నాలని, పండుగలు మనుషుల మధ్య ప్రేమానురాగాలను పెంపొందిస్తాయని చింతల్‌గట్టు గ్రామ దసరా వేడుకలు మరోసారి చాటిచెప్పాయి.గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొనగా, పరస్పర శుభాకాంక్షలు, ఆత్మీయ పలకరింపుల మధ్య విజయదశమి వేడుకలు కన్నుల పండువగా ముగిశాయి.