BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

పోలీసుల  త్యాగాలు చిరస్మరణీయం..... జిల్లా కలెక్టర్.  ఆశీష్ సంఘ్వాన్

Select Suryaa Now
పోలీసుల  త్యాగాలు చిరస్మరణీయం..... జిల్లా కలెక్టర్.  ఆశీష్ సంఘ్వాన్
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : దేశ రక్షణలో అంతర్గత భద్రత మరియు శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ఆశీష్ సంఘ్వాన్ మాట్లాడుతూ పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని వారు చేసిన త్యాగాలను మరువలేమని  ఆయన అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని బుధవారం కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరవీరుల స్తూపం వద్ద వారు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు సిబ్బందితో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుష్పగుచ్చాలు సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసులు విధి నిర్వహణలో అమరులైన పోలీసుల స్ఫూర్తి విలువలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ తెలిపారు.1959 అక్టోబర్ 21 రోజున లడక్ లో ని అక్సయ్ చిన్  ప్రాంతంలో చైనా దళాల దాడిలో పది మంది వీరమరణం పొందిన సిఆర్పిఎఫ్ జవాన్ల త్యాగ సంస్మరణార్థం  ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 1 54 మంది, తెలంగాణ వ్యాప్తంగాఏడుగురు పోలీసులు వీరమరణం పొందినట్లు వారు తెలిపారు. వారి త్యాగాలు పోలీస్ శాఖకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ పోలీసులు చేసిన త్యాగాలు మరువలేనివని పోలీసు అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని సమస్యలను ఏ సమయంలో నేరుగా తమకు తెలియజేయవచ్చు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసులకు మరియు విద్యార్థులకు ప్రజలకు ఆన్లైన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.