పండుగలు కలిసి జరుపుకుంటేనే సార్ధకత :మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి..
మల్కాజిగిరి, మేజిక్ న్యూస్ : పండుగలు ఐకమత్యానికిగా నిదర్శనంగా నిలుస్తాయని వినాయక్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి అన్నారు. దసరా పండగ సంద ర్భంగా వినాయక్ నగర్ డివిజన్ లోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలో ఆమె పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసు కున్నారు.
తదనంతరం బతుకమ్మ వేడుకలు, దసరా సమ్మేళనంలో ఆమె తన తల్లిదండ్రు లతో కలిసి పాల్గొని, డివిజన్ ప్రజలకు 'దసరా శుభాకాంక్షలు' తెలియజేశారు. ఈ సందర్భంగా క్యానం రాజ్యలక్ష్మీ మాట్లాడు తూ, పండుగలను అందరం కలిసి మెలిసి ఉత్సాహభరిత వాతావరణంలో జరుపు కుంటేనే వాటికి సార్ధకత లభిస్తుందని, త ద్వారా ప్రజల్లో సమానత్వం ఏర్పడుతుంద న్నారు.
బీద, ధనిక అనే తారతమ్యం లేకుం డా ఉత్సవాల్లో పేదలను అధికంగా భాగస్వా మ్యులను చేయడం ద్వారా, వారిలో ఎనలేని సంతోషం వ్యక్తం అవుతుందన్నారు. కుల మతాలకు అతీతంగా సోదరభావంతో పండు గలు జరుపుకోవడం చాలా మంచిదన్నారు. ప్రజలు భక్తి మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా రాగద్వేషాలు దూరమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత వడ్డీ సుబ్బారావు దంపతులు, స్థానిక నాయకులు, కాలనీల ప్రజలు పాల్గొన్నారు.