BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి.

Select Suryaa Now
పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి.
సూర్య కోనరావుపేటపోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందించడంతో పాటు పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే పోలీసు సిబ్బందికి సూచించారు. బుధవారం కోనరావుపేట పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్ పనితీరును సమీక్షించారు.ఈ సందర్భంగా కేసుల పురోగతి, పెండింగ్ దర్యాప్తులు, స్టేషన్ రికార్డులు, సిబ్బంది హాజరు, రౌడీషీటర్లు, నేరస్తులపై నిఘా తదితర అంశాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌కు వివిధ సమస్యలతో వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని, స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పోలీసులు అవగాహన పెంచుకోవాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఆన్‌లైన్ మోసాలు, నకిలీ లింకులు, ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్టుల పేరుతో జరుగుతున్న మోసాలపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని ఆదేశించారు. డయల్‌ 112కు ఫోన్‌ వచ్చిన వెంటనే పెట్రోలింగ్‌, బ్లూకోల్ట్స్‌ సిబ్బంది స్పందించి ఘటనాస్థలికి చేరుకోవాలని, బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో ఆయన వెంట  సీఐ రవీందర్‌, ఎస్‌ఐ రామ్మోహన్‌, పోలీస్ సిబ్బంది ఉన్నారు.