telangana
పాఠశాలకు కంప్యూటర్ అందజేత
సూర్య రెంజల్ : మండలంలోని కందకుర్తి ఉర్దూ మీడియం పాఠశాలకు కంప్యూటర్ ను అందించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ కరీం తెలిపారు. గురువారం పాఠశాలలో గ్రామానికి చెందిన దీపక్ గోల్మాల్డర్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాఠశాలకు విద్యార్థుల సౌకర్యార్థం మేరకు కంప్యూటర్ ను అందించడం హర్షనీయమన్నారు. విద్యార్థులు ఉన్నతమైన చదువులను అభ్యసించేందుకై కంప్యూటర్ ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సిరాజ్, శివకుమార్, తుసర్, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు.