పారిశుధ్య కార్మికులకు బట్టలు పంపిణీ
కొండపాక :
గ్రామ అభివృద్ధిలో, పారిశుధ్య పరిరక్షణలో తమ చెమట చిందించి నిస్వార్థంగా సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికుల పట్ల కొండపాక మాజీ జెడ్పీటీసీ అనంతుల అశ్విని - ప్రశాంత్ ఆప్యాయత చాటుకున్నారు. కొండపాక గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకు సోమవారం వస్త్రాలను పంపిణీ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని, గ్రామం పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉండటం వెనుక వారి కష్టం ఎంతో ఉందని ఈ సందర్భంగా వారు కొనియాడారు. గ్రామపంచాయతీ కార్మికుల సేవలకు గుర్తింపుగా, వారిపై ఉన్న అభిమానంతో ఈ చిన్న కానుకను అందజేస్తున్నట్లు తెలిపారు. కార్మికుల సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి గ్రామ నాయకులు, అనంతుల అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బట్టలు అందుకున్న కార్మికులు మాజీ జెడ్పీటీసీ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.