*నెల రోజులైనా పూడ్చని గుంత.. ప్రజలకు తప్పని ఇబ్బందులు*
జిన్నారం:జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో తవ్విన గుంత నెల రోజులు గడుస్తున్నా పూడ్చకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని ట్యాంకు నుంచి పైపులైన్ ఏర్పాటు చేసేందుకు గుంత తవ్వించారని స్థానికులు తెలిపారు. అయితే పనులు ప్రారంభించి గుంతను అలాగే వదిలేయడంతో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులు గడిచినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే గుంతను పూడ్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. లేనిపక్షంలో తామే సొంత ఖర్చులతో గుంతను పూడ్చుకుంటామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.