ముగిసిన వాలీబాల్ పోటీలు
కందుకూరు,: కందుకూరు మండలం కొత్తూరులో వాలీబాల్ పోటీలు ఘనంగా ముగిశాయి. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలు, సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకోవాలని సర్పంచ్ మండల కృష్ణ సూచించారు. విజయదశమి సందర్భంగా కొత్తూరు గ్రామంలోని ప్రగతి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో విజేతలకు డీసీసీబీ డైరెక్టర్ పొట్టి ఆనంద్‌తో కలిసి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పొట్టి ఆనంద్ మాట్లాడుతూ యువత సేవా కార్యక్రమాలతో సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని, క్రీడలు ఐక్యత, క్రమశిక్షణను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు పాల్గొన్నారు.
ట్. శ్రీనివాస్, మేజర్ న్యూస్