BREAKING
గ్లామరస్ ఫొటోషూట్‌తో అదరగొడుతున్న ప్రియాంక చోప్రా.. హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్న గ్లోబల్ స్టార్! ఎంపీటీసీ ఎన్నికలకు 21 నుండి నామినేషన్లు - ఎంపీడీవో జవహర్ బాబు సరికొత్తగా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్' వెబ్ సిరీస్.. సంచలన లుక్‌తో షనయా కపూర్ ఎంట్రీ! నాగర్ కర్నూల్ రామాలయంలో మంగళవారం దసరా శమీ పూజలు, వాహన పూజలు, అర్చనలు.… ప్రజల ఆశీర్వాదమే ఎన్డీఏ కూటమి బలం రాష్ట్ర అభివృద్ధే మా లక్ష్యం... ఓటీటీలోకి యామీ గౌతమ్ 'నయ్యి నవెల్లి'.. డిజిటల్ స్ట్రీమింగ్ అప్‌డేట్ వచ్చేసింది! నాగర్ కర్నూల్ లో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల నిరసన లో తల్లులకు తోడుగా కూతుళ్లు నెల్లుట్ల గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు-సర్పంచ్ నర్సింగ రామకృష్ణ పని అడగడానికి సిగ్గుపడను.. నటనకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంచుతా అంటున్న స్మృతి ఇరానీ జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసిన ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి* వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులతో మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఆత్మీయ భేటీ ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణాల మోత.. అంబరాన్నంటిని బతుకమ్మ సంబరాలు-విజేతలకు బహుమతులు అందజేసిన స్వయంకృషి సంస్థ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలి కోమటి చెరువు పై అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ..!

ముద్దాయిపేటలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
ముద్దాయిపేటలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

పుల్కల్  : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలను 
పుల్కల్ మండల పరిధిలోని ముద్దాయిపేట గ్రామంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
గ్రామంలోని ఆడపడుచులు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. మహిళల బతుకమ్మ పాటలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

గ్రామంలోని మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ పండుగ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం చెరువు వద్దకు చేరుకుని, బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేశారు. గ్రామ ప్రజలు ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు.గ్రామ సర్పంచ్ వినోద యాదయ్య, ఉపసర్పంచ్ పెద్దగొల్ల సత్యనారాయణ, గ్రామ పెద్దలు కమల్‌రెడ్డి, నరేష్ గౌడ్, వార్డు సభ్యుడు శేఖర్ తదితరుల ఆధ్వర్యంలో వేడుకలకు ఏర్పాట్లు చేశారు.