మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే 10,000 ఆర్థిక సహాయం
హాలియా మేజర్ న్యూస్.: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం, అనుముల మండలం పులిమామిడి గ్రామానికి చెందిన పజ్జూరి కోటేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగినది,
ఈ విషయం తెలుసుకున్న నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి , అయ్యప్ప మాలధారణలో ఉండటంతో స్వయంగా రాలేకపోయినప్పటికీ, హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి ద్వారా మృతుని కుటుంబానికి ₹10,000 ఆర్థిక సహాయం పంపించారు,
ఈ సందర్భంగా చైర్మన్ చింతల చంద్రారెడ్డి , అనుముల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల శ్రీనివాస్ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు,కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు,
ఈ కార్యక్రమంలో పులిమామిడి సర్పంచ్ మాలే అరుణమ్మ, సత్యనారాయణ రెడ్డి ,సర్పంచుల ఫోరం అధ్యక్షులు కందుల మదన్ రెడ్డి , తక్కెళ్లపల్లి సైదులు (డీలర్) ,మాలే జానారెడ్డి, సోషల్ మీడియా మధు తదితరులు పాల్గొన్నారు.