BREAKING
ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధికి బాటలు వేస్తా భారత్‌–అమెరికా సంబంధాలకు ప్రజాస్వామ్య సంస్థలే బలమైన పునాది: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఇటలీ అంతర్జాల దాడులకు బాధ్యులెవరో స్వతంత్రంగా నిర్ధారించాల్సి ఉంది.. సాంకేతిక దర్యాప్తులో కీలక అంశాలు! ఏపీలో 601 ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు పూర్తి.. ఒకే రోజు థియేటర్లలో మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు! పొన్నూరు 37వ వార్డులో జోరందుకున్న వైసీపీ ఎన్నికల ప్రచారం ప్రచారంలో పాల్గొన్న వైసీపీ చైర్మన్ అభ్యర్థి షేక్ నాజిని సిద్ధిపేట.. ఇక కాంగ్రెస్ అడ్డా.. బ్యాచులర్ పార్టీ డ్యూక్స్ రివ్యూ.. 14 ఏళ్ల తర్వాత అమల్ నీరద్ స్టైలిష్ యాక్షన్ ఎలా ఉందంటే? అన్నారంలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ రుద్ర సహిత కాలబైరవ మహా యజ్ఞంకు విస్తృత ఏర్పాట్లు ఓం సినిమాకు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్.. తెలుగు వెర్షన్‌కే అగ్రస్థానం! శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం శరీరానికి ఉపవాసం..మనసుకు నామస్మరణ.. ఆత్మకు ఆధ్యాత్మిక చింతన..అనుగ్రహించేదే.. మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం హెయిల్ మేరీ నుంచి మారివిల్ చిరకే వీడియో సాంగ్ విడుదల.. సూరజ్ వెంజారమూడు భావోద్వేగ నటన!

మహబూబ్ నగర్ బైపాస్ కు అనుమతులు మంజూరు చేయండి

Select Suryaa Now
మహబూబ్ నగర్ బైపాస్ కు అనుమతులు మంజూరు చేయండి

మహబూబ్ నగర్, సూర్య బ్యూరో: మహబూబ్‌నగర్ పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నివారించడంతో పాటు ప్రాంతీయ రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు బైపాస్ రోడ్డు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. గురువారం హైదరాబాద్‌లోని నవోటెల్‌లో కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమం కింద ఎన్‌హెచ్‌-167లోని 275/350 కిలోమీటర్ నుంచి ఎన్‌హెచ్‌-167ఎన్‌లోని 13/285 కిలోమీటర్ వరకు మహబూబ్‌నగర్ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే మహబూబ్‌నగర్ పట్టణంలో వాహనాల రద్దీ తగ్గడంతో పాటు హైదరాబాద్, జడ్చర్ల, కర్ణాటక, రాయచూర్ ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని వివరించారు. ఈ రహదారి వల్ల ప్రాంతీయ పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభించడంతో పాటు రైల్వే స్టేషన్‌కు రవాణా అనుసంధానం మెరుగుపడుతుందని ఎంపీ పేర్కొన్నారు. ముఖ్యంగా రైతులు తమ పంటలను వివిధ మార్కెట్లకు సులభంగా తరలించేందుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పిల్లలమర్రి అభివృద్ధికి, గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు, అత్యవసర వైద్య సేవలను సులభంగా పొందేందుకు ఈ బైపాస్ రోడ్డు కీలకంగా మారుతుందని కేంద్ర మంత్రికి వివరించారు. మహబూబ్‌నగర్ జిల్లా సమగ్ర అభివృద్ధి, ప్రజల ప్రయాణ సౌకర్యాలు, ఆర్థిక పురోగతిని దృష్టిలో ఉంచుకుని బైపాస్ రోడ్డు నిర్మాణానికి త్వరితగతిన పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని కోరారు.