telangana
లలిత త్రిపుర సుందరిగా చిన్నారి అవిష సైనోజీ.. ఆకట్టుకున్న వేషధారణ
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్:ఘట్కేసర్ పట్టణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శ్రీశ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గోల్డెన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అమ్మవారి మండపం వద్ద నిర్వహించిన వేడుకల్లో భాగంగా సైనోజీ నరేష్–సింధూజ దంపతుల కుమార్తె అవిష సైనోజీ అమ్మవారి దివ్య స్వరూపమైన లలిత త్రిపుర సుందరి వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయబద్ధమైన అలంకరణలో చిన్నారి దైవస్వరూపంగా కనిపించడంతో వేడుకలకు హాజరైనవారు విశేషంగా ఆకట్టుకున్నారు. చిన్నారి వేషధారణ పలువురిని మంత్రముగ్ధులను చేయగా, వేడుకల్లో భక్తిభావం వెల్లివిరిసింది.
రిపోర్టర్: గుర్రం రమేష్, ఘట్కేసర్, మేడ్చల్ జిల్లా.