క్యాన్సర్ పరిశోధనకు బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ సంస్థ విస్తృత మద్దతు
‘సీ2సీ4సీ’ సైక్లింగ్ కార్యక్రమంలో పాల్గొన్న భారత్‌కు చెందిన 14 మంది ఉద్యోగులు
ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ఆరు దేశాల నుంచి 55 మందికి పైగా ఉద్యోగుల భాగస్వామ్యం
హైదరాబాద్, మేజర్ న్యూస్: క్యాన్సర్ పరిశోధనకు మద్దతు అందించడంతో పాటు క్యాన్సర్‌తో ప్రభావితమైన రోగులు, వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రముఖ జీవ ఔషధ సంస్థ బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ (బీఎంఎస్) తన ‘కాంటినెంట్ టు కాంటినెంట్ ఫర్ క్యాన్సర్’ (సీ2సీ4సీ) కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. అక్టోబర్ 6 నుంచి 20 వరకు జపాన్‌లో జరుగుతున్న ఈ 15 రోజుల కార్యక్రమంలో ఆరు దేశాలకు చెందిన 55 మందికి పైగా ఉద్యోగులు పాల్గొంటున్నారు. రోగులే మా కార్యకలాపాలకు కేంద్రబిందువు బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ సీనియర్ డైరెక్టర్ (పీపుల్ ఆర్గనైజేషన్, బోర్డు, కార్పొరేట్ సామాజిక బాధ్యతలు) శ్రియా దత్ మాట్లాడుతూ.. తమ సంస్థ చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ రోగులే కేంద్రబిందువుగా ఉంటారని తెలిపారు. ఉద్యోగులు తమ రోజువారీ విధులకు అతీతంగా ఒక మంచి లక్ష్యం కోసం కలిసి పనిచేసేందుకు సీ2సీ4సీ అవకాశం కల్పిస్తోందన్నారు. క్యాన్సర్‌తో ప్రభావితమైన రోగులు, వారి కుటుంబాలకు నేరుగా మద్దతు అందించే ఈ కార్యక్రమంలో భారత్‌కు చెందిన 14 మంది ఉద్యోగులు ఆసియా పసిఫిక్ ప్రాంత సహోద్యోగులతో కలిసి పాల్గొనడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమష్టి కృషి ద్వారా క్యాన్సర్ బాధితులకు మరింత సహాయం అందించవచ్చనే విషయాన్ని తెలియజేస్తాయని చెప్పారు.
13 ఏళ్లుగా కొనసాగుతున్న కార్యక్రమం: సీ2సీ4సీ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. క్యాన్సర్ పరిశోధనకు నిధులు సమకూర్చడంతో పాటు ఉద్యోగులందరినీ ఒకే లక్ష్యం కోసం ఏకతాటిపైకి తీసుకురావడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోంది. 2014లో అమెరికాలోని ఆంకాలజీ విభాగం ఉద్యోగులు క్యాన్సర్‌తో ప్రభావితమైన వారికి మరింత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ గురించి. యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ గురించి యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (యూఐసీసీ) ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత పురాతన అంతర్జాతీయ క్యాన్సర్ సంస్థ. 1933లో ప్రారంభమైన ఈ సంస్థలో 170కి పైగా దేశాలు, ప్రాంతాలకు చెందిన 1,150కు పైగా సభ్య సంస్థలు ఉన్నాయి. వీటిలో క్యాన్సర్ నియంత్రణ సంఘాలు, పరిశోధనా సంస్థలు, చికిత్సా కేంద్రాలు, ఆసుపత్రులు, ప్రజారోగ్య సంస్థలు, రోగులకు మద్దతు అందించే సంస్థలు ఉన్నాయి. అలాగే 70కి పైగా వ్యూహాత్మక భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది.