కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తూపల్లి విజయభాస్కర్ రెడ్డి
దుండిగల్ మేజర్ న్యూస్ : దుండిగల్: ఐడీఏ బొల్లారం సర్కిల్‌కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తూపల్లి విజయభాస్కర్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)ను మర్యాదపూర్వకంగా కలిశారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి ఆయన కేటీఆర్ నివాసానికి చేరుకుని ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులు తూపల్లి విజయభాస్కర్ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజాసేవలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు నిరంతరం ప్రజల్లో ఉండాలని ఈ సందర్భంగా నేతలు చర్చించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జిన్నారం వెంకటేష్ గౌడ్‌తో పాటు ఐడీఏ బొల్లారం, దుండిగల్ ప్రాంతాలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.