కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కంచర్ల వెంకట్‌రెడ్డి
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్:
ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కంచర్ల వెంకట్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, నక్క ప్రభాకర్‌గౌడ్, వేముల మహేష్‌గౌడ్, కర్రె రాజేష్, సామల అమర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో పలుమార్లు వార్డు సభ్యుడిగా పనిచేసిన ఆయన, పార్టీకి సంబంధించిన వివిధ పదవుల్లోనూ బాధ్యతలు నిర్వహించారు. తనకు అప్పగించిన నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, పార్టీ అభ్యున్నతికి, బలోపేతానికి కృషి చేస్తానని కంచర్ల వెంకట్‌రెడ్డి తెలిపారు.
రిపోర్టర్: గుర్రం రమేష్, ఘట్కేసర్, మేడ్చల్ జిల్లా.