BREAKING
జీహెచ్‌ఎంసీ క్రీడా పోటీలు–2026 ప్రారంభం సిబిఎస్ఇ జాతీయ జిమ్నాస్టిక్ ఛాంపియన్‌షిప్ 2026 ప్రశాంత్ నగర్ కాలనీలో రోడ్డు ప్రమాదాలు నివారించండి .. కర్కాటక రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Cancer Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani రాహుల్ గాంధీ కాబోయే దేశ ప్రధాని: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి బాలయ్య నగర్ అభివృద్ధికి మరింత ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మిథున రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani కోమటికుంట చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి..: ప్రజావాణిలో ఆకుల సతీష్ ఫిర్యాదు.. ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలి.. వృషభ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ప్రభుత్వ పాఠశాలలో సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్ఠ..* *విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ* పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మేష రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Aries Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ఖైదీల మానసిక ఆరోగ్యానికి ‘ఉల్లాసం’ కార్యక్రమం ఫలించిన మేల్లగూడ గిరిజనుల పోరాటం...

కల్యాణలక్ష్మి.. సక్సెషన్ భూముల దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన

Select Suryaa Now
కల్యాణలక్ష్మి.. సక్సెషన్ భూముల దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన

కొండాపూర్‌;కొండాపూర్‌: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ, అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఇందులో భాగంగా కొండాపూర్‌ మండల తహసీల్దార్‌ అశోక్‌ స్వయంగా గ్రామాల్లో పర్యటిస్తూ దరఖాస్తుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు, ధ్రువపత్రాలను తనిఖీ చేశారు.చెర్ల గోపులారం, కొండాపూర్‌ గ్రామాల్లో కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల నివాసాలను సందర్శించి, సమర్పించిన ధ్రువపత్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తేర్పోల్‌, తోగర్పల్లి గ్రామాలో సక్సెషన్ భూముల  మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి దరఖాస్తులను, సంబంధిత వివరాలను తనిఖీ చేశారు.అర్హత నిర్ధారణకు ప్రత్యక్ష పరిశీలనఈ సందర్భంగా తహసీల్దార్‌ అశోక్‌ మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి పథకం, పట్టా భూముల భౌతిక మార్పిడి దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారులను స్వయంగా కలిసి పూర్తి వివరాలు సేకరించి, ధ్రువపత్రాలను పరిశీలించిన అనంతరం అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నిజమైన అర్హులకు చేరేలా పారదర్శకంగా ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, గ్రామపంచాయతీ అధికారులు పాల్గొన్నారు. తేర్పోల్‌ జీపీవో రమేష్‌, తోగర్పల్లి జీపీవో తదితరులు పరిశీలనలో పాల్గొన్నారు.