జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
తాండూరు, మేజర్ న్యూస్: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య భద్రత, సంక్షేమ పథకాలు కల్పించే అంశాలపై ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని పేర్కొన్నారు.శుక్రవారం తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) వికారాబాద్ జిల్లా నూతన కార్యవర్గంలో కీలక పదవులు పొందిన జర్నలిస్టులను ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన బషీరాబాద్ సాక్షి విలేకరి బి. నర్సిములు, కోశాధికారిగా పి. వెంకట్‌రెడ్డి, కార్యదర్శి రాంచందర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఏబీఎన్ నర్సిములు, కార్యవర్గ సభ్యులు వెంకటేశం (వాసు), శాంతకుమార్, బాబర్, కే. నర్సిములను శాలువాలతో సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ… జర్నలిస్టులకు యూనియన్‌లో కీలక బాధ్యతలు లభించడం అభినందనీయమని పేర్కొన్నారు. నూతన కార్యవర్గం జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. జర్నలిస్టుల ఐక్యతను కాపాడుతూ వారి సంక్షేమం కోసం సంఘటితంగా పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో యూనియన్ తాజా మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసచారి, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్‌రెడ్డి, కోటపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ మధులత శ్రీనివాసచారి, సర్ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు, జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు శోభారాణి, బషీరాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, సొసైటీ మాజీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, తాండూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగు, పెద్దేముల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లోంక నర్సిములు, ప్రభాకర్ గౌడ్, హన్మాపూర్ సర్పంచ్ లోంక రాములు, సీనియర్ జర్నలిస్టులు పి. రామచందర్, నర్సింలు, వెంకట్‌రెడ్డి, వాసు, శాంతకుమార్, బాబర్‌తో పాటు వివిధ మండలాల జర్నలిస్టులు, నాయకులు పాల్గొన్నారు.