జలచరాలపై విద్యార్థులకు అవగాహన
చౌటుప్పల్, మేజర్ న్యూస్:త్రినిటీ విద్యాసంస్థల్లో ప్రీప్రైమరీ విద్యార్థులకు నీటి రకాలు, జలచరాలపై ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. చేపలు, తాబేళ్లు, తిమింగలాలు, డాల్ఫిన్లు, మొసళ్లు తదితర జలచరాల గురించి చిత్రాల ద్వారా వివరించారు. నీటి సంరక్షణ, వర్షపు నీటి వినియోగం, ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించి ‘నీటిని కాపాడుకుందాం.. జలచరాలను రక్షిద్దాం’ అని ప్రతిజ్ఞ చేయించారు. డైరెక్టర్, ప్రిన్సిపల్ డాక్టర్ వి. మంజుల, చైర్మన్ కె.వి.బి. కృష్ణారావు, సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.