BREAKING
గ్లామరస్ ఫొటోషూట్‌తో అదరగొడుతున్న ప్రియాంక చోప్రా.. హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్న గ్లోబల్ స్టార్! ఎంపీటీసీ ఎన్నికలకు 21 నుండి నామినేషన్లు - ఎంపీడీవో జవహర్ బాబు సరికొత్తగా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్' వెబ్ సిరీస్.. సంచలన లుక్‌తో షనయా కపూర్ ఎంట్రీ! నాగర్ కర్నూల్ రామాలయంలో మంగళవారం దసరా శమీ పూజలు, వాహన పూజలు, అర్చనలు.… ప్రజల ఆశీర్వాదమే ఎన్డీఏ కూటమి బలం రాష్ట్ర అభివృద్ధే మా లక్ష్యం... ఓటీటీలోకి యామీ గౌతమ్ 'నయ్యి నవెల్లి'.. డిజిటల్ స్ట్రీమింగ్ అప్‌డేట్ వచ్చేసింది! నాగర్ కర్నూల్ లో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల నిరసన లో తల్లులకు తోడుగా కూతుళ్లు నెల్లుట్ల గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు-సర్పంచ్ నర్సింగ రామకృష్ణ పని అడగడానికి సిగ్గుపడను.. నటనకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంచుతా అంటున్న స్మృతి ఇరానీ జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసిన ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి* వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులతో మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఆత్మీయ భేటీ ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణాల మోత.. అంబరాన్నంటిని బతుకమ్మ సంబరాలు-విజేతలకు బహుమతులు అందజేసిన స్వయంకృషి సంస్థ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలి కోమటి చెరువు పై అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ..!

ఇజ్జత్‌నగర్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
 ఇజ్జత్‌నగర్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

కొండాపూర్,మేజర్ న్యూస్ :మాదాపూర్  డివిజన్ పరిధిలోని శిల్పా పార్క్‌లో ఉన్న ఉదయ క్రెసెంట్ వద్ద బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీజేపీ నాయకులు, స్థానిక ప్రముఖులతో కలిసి   గంగల రాధాకృష్ణ యాదవ్ పాల్గొని మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంగణమంతా పండుగ శోభతో కళకళలాడింది.ఈ సందర్భంగా గంగల రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, మన సంస్కృతి సంప్రదాయాల వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న మన సంస్కృతిని, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇటువంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.ఈ బతుకమ్మ వేడుకలు స్థానిక మహిళల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు, ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పాయి.