హెల్త్ సూపర్వైజర్ ఆధ్వర్యంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం
సూర్య చొప్పదండి : చొప్పదండి పట్టణంలో శుక్రవారం రోజున డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మసీద్ దగ్గరలోని ఇండ్లలో సర్వే చేసి, నీళ్లు నిలువ ఉన్నచోట, నీళ్లను క్రింద పడపోసి, దోమల నివారణకు, అలాగే దోమ కాటు వలన వచ్చే జ్వరాలకు తగు జాగ్రత్తలు సూచనలు మసీద్ వాడలోని కుటుంబ సభ్యులకు వివరించారు.. ఈ కార్యక్రమంలో ఫిమేల్ హెల్త్ సూపర్వైజర్ జి శ్రీదేవి, మేల్ సూపర్వైజర్ జాకీర్ హుస్సేన్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వెంకటస్వామి, ఆశ వర్కర్ సుజాత, తదితరులు పాల్గొన్నారు..