BREAKING
అయ్యప్ప దీక్షాదారుల కోసం మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభం నవంబర్ 22న శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు క్యాన్సర్ చికిత్సలో కీలక మైలురాయి...ఆస్ట్రాజెనెకా స్టమక్ క్యాన్సర్ ఔషధానికి సఫలత విధులు నిర్వహిస్తున్న ప్రవళికపై దాడి వారిని పై హత్యానేరం క్రింద కేసు బుక్ చేయాలి :టి జెఎమ్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ రాష్ట్రాల ఎన్నికలను స్వాధీనం చేసుకునే ఉద్దేశం ట్రంప్‌కు లేదు మునిగిపోతున్న నౌక-40 మంది ఇరాన్ నావికులను రక్షించిన ఎస్ఎల్ నేవీ 32వ డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ది చేయడమే లక్ష్యం.. టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి బట్టే వెంకట కీర్తి... వెనిజులాకు తిరిగి వచ్చిన ప్రముఖ ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అలయ్ బలయ్ డిక్లరేషన్ ఫామ్స్ ఇచ్చిన ఎమ్మెల్యే ఎరపతినేని ఇటలీ లీగ్ పార్టీ నేతగా మళ్లీ ఎన్నికైన మట్టేయో సాల్విని భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో పద్మభూషణ్ వెంపటి చిన్న సత్యం జయంతి వేడుకలు కూటమి చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబుకి బ్రహ్మరథం : 28వ వార్డులో జన ప్రభంజనం మధ్య ఎన్నికల ప్రచారం : పచ్చిపాల రామకృష్ణ ఆచారి,తులసి దంపతులు ఆత్మీయ స్వాగతం అశాంతిని అరికట్టేందుకు కొత్త నిబంధనలు ఉన్నప్పటికీ తిరానాలో చెలరేగిన నిరసనలు గిన్నిస్‌ ప్రపంచ రికార్డులతో గీతం పూర్వ విద్యార్థిని చరిత్ర

హస్తినాపురంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం.. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని బీజేపీ పిలుపు!

Select Suryaa Now
 హస్తినాపురంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం.. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని బీజేపీ పిలుపు!

సూర్య సిటీ బ్యూరో, కర్మన్‌ఘాట్/హైదరాబాద్: మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నారు. హస్తినాపురం డివిజన్ పరిధిలోని కర్మన్‌ఘాట్ శ్రీ రమణ కాలనీ ఫేజ్-1 కమ్యూనిటీ హాల్‌లో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించారు. అర్హులైన పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకునేలా అవగాహన కల్పించడంతో పాటు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను చేపట్టారు.

ఈ సందర్భంగా హస్తినాపురం డివిజన్ బీజేపీ అధ్యక్షుడు ఎరుకల మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో గ్రాడ్యుయేట్లకు లభించిన అత్యంత విలువైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 2023 నాటికి లేదా అంతకంటే ముందుగానే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన గ్రాడ్యుయేట్లు వెంటనే ఎమ్మెల్సీ ఓటరుగా పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.

ఈ ఓటరు నమోదు కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బొగ్గుల మాధవరెడ్డి, జనరల్ సెక్రెటరీ గౌని వెంకటేష్ గౌడ్, మహిళా మోర్చా నాయకురాలు విజయ్ చౌదరి, కంది శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ మోర్చా జనరల్ సెక్రెటరీ లక్ష్మీకాంత్ రెడ్డిలతో పాటు స్థానిక నాయకులు జగదీశ్వర్, శ్రీనివాస్ గుప్తా, కిట్టు ప్రమీల తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.