ఘనంగా బాలల దినోత్సవం తేల కంటి గూడెంలో విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడుతున్న అధికారులు
కనగల్ మేజర్ న్యూస్: మండల వ్యాప్తంగా చాచా నెహ్రు పుట్టినరోజు (బాలల దినోత్సవం) ను శనివారం ఘనంగా నిర్వహించారు. చాచా నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థులు భవిష్యత్తుకు బాటిల్ వేసి నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలన్నారు. చాచా నెవరపు చిన్నారులు అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. చాచా నెహ్రు భారతదేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామాల సర్పంచులు, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీలు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.