BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

గీతంలో ‘సినీవారం 2026’ ప్రారంభం

Select Suryaa Now
గీతంలో ‘సినీవారం 2026’ ప్రారంభం

హైదరాబాద్, మేజర్ న్యూస్ ప్రతినిధి : విద్యార్థుల్లో సృజనాత్మకత, సినిమా నిర్మాణ నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ ప్రాంగణంలో ‘సినీవారం 2026’ కార్యక్రమం ప్రారంభమైంది. మీసేవ సహకారంతో గీతం విద్యార్థి విభాగం జి-స్టూడియో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల వేడుకల్లో వర్క్‌షాప్‌లు, సినిమా ప్రదర్శనలు, ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్, గేమ్స్, ముఖాముఖి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫుజిఫిల్మ్‌ఎక్స్ ఇండియా సౌహార్ద్ర రాయబారి బాబ్జ్ చౌదరి ఫొటోగ్రఫీ ప్రదర్శనను సందర్శించి విద్యార్థుల ఎంట్రీలను పరిశీలించారు.

 దర్శకుడు నిఖిల్ నాదెళ్ల వర్క్‌షాప్ నిర్వహించారు. పలు వినోదాత్మక గేమ్ స్టాళ్లు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. రెండో రోజు స్టోరీబోర్డింగ్ పోటీతో పాటు డాక్యుమెంటరీ ఫొటోగ్రాఫర్ కిషోర్ కృష్ణమూర్తి ‘మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని డాక్యుమెంట్ చేయడం’ అంశంపై కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సంగీత దర్శకుడు తమన్‌తో ముఖాముఖి, షార్ట్‌ఫిల్మ్ పోటీ కూడా జరగనున్నాయి. ఈ పోటీకి దర్శకుడు కృష్ణ చైతన్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సినీ పరిశ్రమ నిపుణులతో నేరుగా సంభాషిస్తూ, కథా రచన, ఫొటోగ్రఫీ, సినిమా నిర్మాణంలోని మెళకువలను తెలుసుకునే అవకాశం పొందుతున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించి, వారి సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు సినీవారం 2026 వేదికగా నిలుస్తోంది.