దుర్గామాత మండపం వద్ద మహిళల బతుకమ్మ సంబరాలు
సూర్య, లక్షెట్టిపేట/మంచిర్యాల జిల్లా ప్రతినిధి : లక్షెట్టిపేట పట్టణంలోని గోదావరి రోడ్డు వద్ద సాయి గణేష్ భక్తమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద మహిళలు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ చేరి బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ, దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో మండపం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. భక్తి, సంప్రదాయం, మహిళల ఉత్సాహంతో బతుకమ్మ సంబరాలు సందడిగా సాగాయి.